Post Office | గుడివాడ బ్యూటిఫికేషన్‌కు ప్రత్యేక చర్యలు

Post Office | గుడివాడ బ్యూటిఫికేషన్‌కు ప్రత్యేక చర్యలు
- ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- పట్టణంలో అభివృద్ధి పనుల పరిశీలన
Post Office | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలో అభివృద్ధి పనులతో పాటు సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(MLA Venigandla Ramu) అన్నారు. పట్టణ సుందరీకరణ పనులను అధికారులతో కలిసి ఆయన ఈ రోజు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుడివాడ పట్టణ సుందరీకరణలో భాగంగా అనేక ప్రాంతాల్లో బ్యూటిఫికేషన్(Beautification) పనులు చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలోని నెహ్రూ చౌక్, రాజ బాపయ్య చౌక్‌తో పాటు ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అశుభ్ర వాతావరణంతో ఉండే ఎజికే పాఠశాల వద్ద ఐ లవ్ గుడివాడ నేమ్ బోర్డు(I Love Gudivada Name Board), గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

శిథిలావస్థకు చేరుకున్న పోస్ట్ ఆఫీస్(Post Office) రోడ్డులోని ప్రధాన డ్రైన్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ డ్రైన్ మరమ్మతులతో భారీ వర్షాలు కురిసిన అవుట్ ఫ్లోకు ఇబ్బంది ఉండదన్నారు. పట్టణ సుందరీకరణకు జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రతీ ఒక్కరు తమ సహకారం అందిస్తూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, ఎంఈ. ప్రసాద్, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

