TDP MLA Threats | ‘కుటుంబాన్ని చంపేస్తా’ అంటూ హెచ్చరిక.. కేసు నమోదు
TDP MLA Threats | ‘కుటుంబాన్ని చంపేస్తా’ అంటూ హెచ్చరిక.. కేసు నమోదు
TDP MLA Threats | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. తనతో పాటు కుటుంబ సభ్యులను హత్య చేస్తానంటూ మాలపాటి భాస్కర్‌రెడ్డి బెదిరించాడని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాలపాటి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మాలపాటి భాస్కర్‌రెడ్డి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌లపై కూడా అసత్య ఆరోపణలు చేసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బెదిరింపు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
