చిట్యాలలో కేజీబీవీ అడ్మిషన్లు ప్రారంభం
చిట్యాలలో కేజీబీవీ అడ్మిషన్లు ప్రారంభం
– ప్రత్యేక అధికారి సుమలత
చిట్యాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రత్యేక అధికారి సుమలత సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడవ తరగతిలో 10 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరం సీఈసీ కోర్సులో 20 సీట్లు, ఎంపీడబ్ల్యూహెచ్ కోర్సులో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
చిట్యాల కేజీబీవీ ఐఓఈగా ఎంపికైనట్లు పేర్కొంటూ, సీఈసీ విద్యార్థులకు న్యాయవాద వృత్తి కోర్సులు అయిన లా సెట్, సి.ఎల్.ఏ.టి వంటి పరీక్షలకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి పూర్తిచేసిన బాలికలు నేరుగా కళాశాలలో అడ్మిషన్ పొందవచ్చని సుమలత సూచించారు.
