శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..

జైనూర్, ఆంధ్రప్రభ ; గ్రామపంచాయతీ నూతన వార్డు సభ్యులకు విధి విధానాలు పంచాయతీరాజ్ చట్టాలు తదితర విషయాలపై ఐదు రోజులపాటు ఇస్తున్న శిక్షణ తరగతులను నూతన వార్డు సభ్యులు ప్రతిరోజు శిక్షణలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల అభివృద్ధి అధికారి సుధాకర్ రెడ్డి కోరారు.

జై నూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 22 నుండి 26 వరకు ఐదు రోజులు పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నూతన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వార్డు సభ్యుల పనితీరు విధివిధానాలు చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని గ్రామసభల్లో వ్యవహరించిన విషయాలపై శిక్షణలో అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొ డప ప్రకాష్, మండల పంచాయతీ అధికారి భుఖ్య శశి కుమార్, సూపర్డెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ మోహన్, శిక్షణ ట్రెనర్లు, మండలంలోనిగ్రామపంచాయతీలో నూతన వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply