SURESH | ఖన్సాయిపేట బరిలో విద్యావంతుడు సురేష్

SURESH | ఖన్సాయిపేట బరిలో విద్యావంతుడు సురేష్
బాధ్యతాయుతమైన పాలన అందిస్తా
గెలుపు బాటలో మెరుగు సురేష్ …
SURESH | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం ఖాన్సాయిపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మెరుగు సురేష్ బరిలో ఉన్నారు. గ్రామస్తులు ఈసారి మెరుగు సురేష్ ను సర్పంచిగా గెలిపించుకుంటామని ఆయన తరపున ప్రచారమే చేస్తున్నారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఆయన తెలిపారు. బ్యాటు గుర్తుకు ఓటెయ్యండి, బాధ్యతాయుతమైన పరిపాలన ప్రజలకు అందజేస్తానని ఆయన వివరించారు.
గ్రామంలో రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ పునరుద్ధరణ, సంక్షేమ పథకాలు అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అయన వివరించారు. మెరుగు సురేష్ ప్రచార యాత్రలో ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. మెరుగు సురేష్ కు మద్దతుగా ప్రజలే ఇంటింట ప్రచారాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచి ప్రజాసేవకు ముందుంటానని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఆశీర్వదించి, అవకాశం కల్పించాలని సేవకునిగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. కష్టపడే వారిని ప్రజలు గుర్తించాలని, ప్రజల కోసం పనిచేసే వారు ఎవరో ప్రజలే తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ఎన్నికల్లో బ్యాట్ ప్రభంజనం కొనసాగుతుందని ప్రజలే బహిరంగంలో చెప్పడం కోసం మెరుపు. ఈసారి ఖచ్చితంగా మెరుగు సురేష్ గెలవడం ఖాయమని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.
