supervisor | అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి,
supervisor | అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి,
- బాలామృతం పంపిణీ చేసిన చిట్యాల సర్పంచ్ లక్ష్మి,
supervisor | చిట్యాల, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం, కేంద్రాలను పిల్లలు, బాలింతలు, గర్భిణీలు, సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి కోరారు. బాలమృతం, చిక్కి ప్యాకెట్స్ పంపిణీ చేసి, ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం నూతన సర్పంచ్ తౌటంలక్ష్మి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డు మెంబర్లు తౌటంనవీన్, జెట్టి కుమార్లను శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయప్రద, కోఆర్డినేటర్ లు అనూష ,మమత, అంగన్వాడీ టీచర్స్ భాగ్యమ్మ, అరుణ,మహిళలు, చిన్నారులు, పాల్గొన్నారు.
