ఆడపిల్లలకు విలువ, విద్యను అందిద్దాం

ఆడపిల్లలకు విలువ, విద్యను అందిద్దాం
మంత్రాలయం, ఆంధ్రప్రభ :మండలంలోని చిలకలడోణ, చట్నీ హళ్లి అంగన్వాడీ పాఠశాలల్లో ఆడపిల్లలకు విలువ ఇవ్వడం, విద్యతో ఆమెకు అధికారం కల్పించడం అనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుమిత్ర ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఫాతిమా, రజియా, ఇంద్ర, విజయమ్మ, నాగమ్మ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. “ఆడపిల్లలకు చదువు ఇప్పిద్దాం – విద్యతో ఆమెకు అధికారం కల్పిద్దాం” అనే పోస్టర్లను ప్రదర్శించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు చైతన్యపరిచారు.
పుట్టుకను భారంగా భావించకుండా చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని సూపర్‌వైజర్ సుమిత్ర పేర్కొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అలాంటివి జరిగితే 1098 చైల్డ్ లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామాల విద్యార్థులు పాల్గొన్నారు.
