SUPER SIX | రైతు కళ్ళల్లో ఆనందమే ధ్యేయం

- రబీ పంట పెట్టుబడికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు
- ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
SUPER SIX |నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రబీ సీజన్‌లో రైతుల పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, వ్యవసాయ శాఖ ఏడీఏ నున్న వెంకటేశ్వర్లు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గం, పెండ్లిమర్రి మండలం నుంచి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్- 2025-26 సంవత్సరానికి సంబంధించి రెండవ విడత రైతులకు ఖరీఫ్ కు చేయూతగా అన్నదాత సుఖీభవ ద్వారా నిధులు విడుదల చేశారన్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ ద్వారా రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.2వేలు మొత్తం రూ.7వేలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు రూ.3,135 కోట్లు జమ చేశారని మంత్రి వివరించారు.

ఇందులో నంద్యాల జిల్లాకు సంబంధించి మొత్తం 2,06,052 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.103.03 కోట్లు, పీఎం కిసాన్ లబ్ధిదారులు 183543 మందికి రూ.36.68 కోట్లు, మొత్తం రూ 139.71 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ వివరాలను సభకు వివరించారు.
1.నంద్యాల నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ రైతుల సంఖ్య : 12,953 లబ్ది రూ.6.48 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ధిదారులు 11546 మంది లబ్ది రూ.2.31కోట్లు మొత్తం లబ్ది రూ.8.78 కోట్లు.*
2.నియోజకవర్గ: నందికొట్కూరు అన్నదాత సుఖీభవ రైతుల సంఖ్య : 36,734 లబ్ది రూ.18.37 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ధిదారులు 32879, లబ్ధి రూ.6.57 కోట్లు, మొత్తంగా రూ.24.94 కోట్లును,
3.నియోజకవర్గం : శ్రీశైలం అన్నదాత సుఖీభవ రైతుల సంఖ్య : 25,018 మంది లబ్ది రూ.12.51 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ధిదారులు 22859 మందికి లబ్ది రూ.4.57 కోట్లు, మొత్తంగా రూ.17.08 కోట్లును,
4.నియోజకవర్గం : డోన్ అన్నదాత సుఖీభవ రైతుల సంఖ్య : 35,011 మంది లబ్ది మొత్తం రూ.17.51 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ధిదారులు 30618 మంది లబ్ది రూ.6.123 కోట్లు, మొత్తంగా రూ.23.63 కోట్లును,
5.నియోజకవర్గం : పాణ్యం అన్నదాత సుఖీభవ రైతుల సంఖ్య : 12,691 లబ్ది రూ.6.35 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ధిదారులు 11853 మంది లబ్ది రూ.2.37 కోట్లు, మొత్తంగా రూ.8.71 కోట్లును
6.నియోజకవర్గం : ఆళ్లగడ్డ అన్నదాత సుఖీభవ రైతుల సంఖ్య : 42,981 లబ్ది మొత్తం రూ.21.49 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ధిదారులు 32228 మంది, లబ్ది రూ.7.64 కోట్లు, మొత్తంగా రూ.29.13 కోట్లును,
7.నియోజకవర్గం : బనగానపల్లె అన్నదాత సుఖీభవ రైతుల సంఖ్య : 40,664 లబ్ది మొత్తం రూ.20.33 కోట్లు ను, వారి ఖాతాలో జమ చేశారు.
పి.ఎం.కిసాన్ లబ్ధిదారులు 73725 మంది, లబ్ది రూ.7.10 కోట్లు, మొత్తంగా రూ.27.43 కోట్లును,ఇందులో మొత్తం 2,06,052 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.103.03 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ధిదారులు 183543 మంది. లబ్ధి రూ.36.68 కోట్లు, మొత్తం రూ.139.71 కోట్లు రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

