AYYAPPA | మాలధారణ చేపట్టిన స్వాములు

AYYAPPA | మాలధారణ చేపట్టిన స్వాములు

AYYAPPA | ఊట్కూర్, ఆంధ్రప్రభ :  శ్రీ అయ్యప్ప స్వామి మాలధారణ చేపట్టిన స్వాములు దీక్ష నియమనిష్ఠలతో చేపట్టాలని గురుస్వాములు రఘువీర్, భగవంతు, తమ్మి రెడ్డి శ్రీనివాస్ (Tammi Reddy Srinivas) అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం, పెద్దపోర్ల ఆంజనేయస్వామి దేవాలయంలో పలువురు భక్తులు మాలధారణ చేపట్టారు. ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ శబరి కొండ శ్రీ అయ్యప్ప స్వామి మాలధారణ చేపట్టిన స్వాములు మండల కాలం దీక్ష ఎంతో పవిత్రంగా చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని దేశం ధర్మం కోసం పాటుపడాలని అన్నారు.

అయ్యప్ప మాలధారణ చేపట్టడం పూర్వజన్మ సుకృతమని నిష్టతో దీక్ష కాలం పూర్తిచేసి అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అయ్యప్ప మాలధారణ (Ayyappa Maladharana) ధరించిన కన్య స్వాములకు గురుస్వాములు పలు సలహాలు సూచనలు చేస్తూ దీక్ష ఎంతో పవిత్రంగా చేపట్టాలన్నారు. ఊట్కూర్ లో 22 మంది, పెద్దపుర్లలో 31 మంది అయ్యప్ప భక్తులు మాలధారణ చేపట్టారు. అనంతరం ఊట్కూర్ కకుర్వ వీధిలో అయ్యప్ప స్వాములకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు నరసింహులు భానుచందర్, సందీప్, రమేష్, కథలప్ప, నడిపన్న వెంకప్ప, తదితరులు పాల్గొన్నారు.