వీరాంజనేయ స్వామి దేవాలయానికి రూ.30,116 విరాళం

వీరాంజనేయ స్వామి దేవాలయానికి రూ.30,116 విరాళం

వికారాబాద్, ఆంధ్రప్రభ : మండలంలోని కంకణాలపల్లి గ్రామంలో ఉన్న శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయానికి బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు సుందరి అనిల్ రూ.30,116 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులకు చెక్కును సుందరి దయాకర్ అందజేశారు. దేవాలయ అభివృద్ధికి స్థానికుల సహకారం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.

కార్యక్రమంలో కంకణాలపల్లి గ్రామ పెద్దలు, భక్తులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.