Dead | కృష్ణా జిల్లాలో దారుణం..
Dead | కృష్ణా జిల్లాలో దారుణం..
- గోశాల గ్రామంలో కలకలం
Dead | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గోశాల గ్రామంలో కుటుంబ వివాదం హత్యకు దారితీసింది. స్థలం విషయంలో ఏర్పడిన గొడవలో అల్లుడు తన మామ ఉప్పల సాంబశివరావు (65)ను హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
స్థలం వివాదం నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, అది ఘర్షణకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలో అల్లుడు దాడి చేయడంతో సాంబశివరావు మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
