OTT Movies | తెలుగు ప్రేక్షకులను అలరించనున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వీకెండ్ రానే వచ్చేసింది. సినిమా అభిమానులు ప్రతి వారం ఓటీటీలో కొత్తగా ఏం విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ వారం కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల కోసం విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లను ముందుకు వస్తున్నాయి. తెలుగు నుంచి తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ వరకు అన్ని భాషల్లో ఆసక్తికరమైన కంటెంట్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, డాక్యుమెంటరీ.. ఇలా ఎవరి అభిరుచికి నచ్చిన సినిమా ఈ వారం ఓటీటీలోకి అందుబాటులో ఉన్నాయి.
తెలుగు సినీ లవర్స్ కోసం..
ఈ వారం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాల్లో ‘లెనిన్’, ‘ఓ సుకుమారి’, ‘ఎంఆర్పీ: నీకెంత.. నాకెంత’, ‘గీత సాక్షిగా’ ప్రధానంగా నిలుస్తున్నాయి. కొత్త కథలతో పాటు కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిన ఈ సినిమాలు ఓటీటీ వీక్షకులను అలరించే అవకాశముంది. ఇక థ్రిల్లర్ అభిమానుల కోసం ‘డార్క్ సీక్రెట్స్’ అద్దె విధానంలో(రెంటల్) అందుబాటులోకి వచ్చింది.
తమిళం నుంచి డబ్బింగ్ సినిమాల సందడి..
తమిళంలో విడుదలైన ‘ఇధ్యం మురళి’ తెలుగులో ‘ హృదయం మురళి’ ఈ వారం ఓటీటీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రం తెలుగు సహా పలు భారతీయ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘నూరూ సామి’, ‘వదంతి సీజన్-2’ వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చాయి.
మలయాళం నుంచి ఆసక్తికర కథలు..
మలయాళ సినిమా ప్రేమికుల కోసం ‘ఉయిర్’, ‘పొంగాల’, ‘సత్యత్తిల్ సంభవిచ్చతు’ విడుదలయ్యాయి. వీటిలో ‘ఉయిర్’ తెలుగు డబ్బింగ్‌తో జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉండటం విశేషం. హిందీలో.. దేశభక్తి కథలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ‘ఆపరేషన్ సఫేద్ సాగర్: కార్గిల్ యుద్ధం చెప్పని కథ’ అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది. అలాగే ‘మైన్ వాపస్ ఆఊంగా’ కూడా స్ట్రీమింగ్ ప్రారంభించింది.
ఇంగ్లీస్ సినిమాలు ఇష్టపడే వారి కోసం ఈ వారం కూడా మంచి సినిమాలు, వెబ్ సిరిస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ‘టెడ్ లాస్సో సీజన్-4’, ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’, ‘ది లాస్ట్ హౌస్’, ‘లవ్ హర్ట్స్’, ‘స్టెర్లింగ్ పాయింట్’, ‘రికీ జెర్వైస్: అలీ క్యాట్స్’ వంటి సినిమాలు, సిరీస్‌లు ప్రముఖ ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి.
ఈ వారం విడుదలైన ప్రధాన ఓటీటీ చిత్రాలు
తెలుగు
లెనిన్ – జీ5
ఓ సుకుమారి – ప్రైమ్ వీడియో
ఎంఆర్పీ: నీకెంత.. నాకెంత – ప్రైమ్ వీడియో
డార్క్ సీక్రెట్స్ – ప్రైమ్ వీడియో (అద్దె)
గీత సాక్షిగా – ఈటీవీ విన్
తమిళం
ఇధ్యం మురళి – నెట్‌ఫ్లిక్స్
నూరూ సామి – జీ5
వదంతి సీజన్-2 – ప్రైమ్ వీడియో
డార్క్ జెయింట్ – ఆహా తమిళ్
నిజల్ – సింప్లీ సౌత్
మలయాళం
ఉయిర్ – జియోహాట్‌స్టార్
పొంగాల – మనోరమా మ్యాక్స్
సత్యత్తిల్ సంభవిచ్చతు – సన్ నెక్స్ట్
హిందీ
ఆపరేషన్ సఫేద్ సాగర్ – నెట్‌ఫ్లిక్స్
మైన్ వాపస్ ఆఊంగా – నెట్‌ఫ్లిక్స్
ఇంగ్లీష్
టెడ్ లాస్సో సీజన్-4
ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ
ది లాస్ట్ హౌస్
లవ్ హర్ట్స్
స్టెర్లింగ్ పాయింట్
రికీ జెర్వైస్: అలీ క్యాట్స్
బిగ్ చికెన్
ఎ పోయెట్ తదితర చిత్రాలు.
ఈ వారం ఓటీటీలో అన్ని వర్గాల ప్రేక్షకులకు సరిపోయే కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. కొత్త తెలుగు సినిమాలు, భారీ డబ్బింగ్ రిలీజ్లు, అంతర్జాతీయ వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు.. ఇలా ప్రతి జానర్లో కొత్త వినోదం సిద్ధంగా ఉంది. వీకెండ్‌ను ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ వారం ఓటీటీ రిలీజ్లు మంచి ఎంపికగా నిలుస్తాయి. మరి ఇకేందుకు ఆలస్యం మీరు ఏ సినిమా చూడాలి అనుకుంటున్నారో.. వెంటనే ఈ వీకెండ్ కోసం బుక్ మార్క్ చేసుకునే చూసేయండి.
