రహదారి నిర్మాణంలో వేగం పెంచాలి…

రహదారి నిర్మాణంలో వేగం పెంచాలి…

కేంద్ర మంత్రికి చొప్పదండి ఎమ్మెల్యే వినతి

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : కరీంనగర్ నుండి జగిత్యాల వరకు నిర్మిస్తున్న ఎన్ హెచ్ 563 జాతీయ రహదారి పనుల్లో వేగం పెంచాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కోరారు.

గురువారం డిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి పనుల పురోగతిలో వేగం పెంచేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిందని జాతీయ రహదారి పనులను వేగంగా పూర్తి చేస్తే వాహనదారులకు ఇబ్బందులు తొలగడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు.

Leave a Reply