అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక పి ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్ని ప్రమాదాలపై ప్రదర్శన పూర్వక అవగాహనను కల్పించారు. అగ్ని ప్రమాదాలను నివారించడం ఎలా, ప్రమాదాల నుండి కాపాడుకునే పద్ధతులను ప్రదర్శించి చూపారు. ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్, సిబ్బంది మల్లికార్జున్,హరీష్ రెడ్డి, కరుణాకర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
