విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సు కిట్లు పంపిణీ…

విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సు కిట్లు పంపిణీ…
పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలల్లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిలో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో పి.ఏం.ఎం.కే బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు 2025-26 విద్యా సంవత్సరానికి గాను వృత్తి విద్యా కోర్సులను మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ పాఠశాలలో ఆధునిక సాంకేతిక రంగానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ విభాగాలను ఈ ఏడాది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మైనం హుస్సేన్ అన్నారు.
