Godavari Pushkaralu | ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి వద్దు
Godavari Pushkaralu | ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి వద్దు
Godavari Pushkaralu |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : గోదావరి పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఓ ఘాట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పేరు పెట్టడం వివాదానికి దారితీసిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని ఆయన హాస్యాస్పదంగా అభివర్ణిస్తూ, ఆ పేరును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో ఇలాంటి చర్యలు సముచితం కాదని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజా వేదికలపై వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
వివాదం తలెత్తిన వెంటనే స్పందించిన లోకేశ్, సంబంధిత అధికారులతో మాట్లాడి ఘాట్‌కు పెట్టిన పేరును తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి వివాదాలకు తావివ్వదనే సంకేతాన్ని ఇచ్చారు.
