OYO Rooms | ఓయో రూమ్లలో ఆకస్మిక తనిఖీలు
OYO Rooms | ఓయో రూమ్లలో ఆకస్మిక తనిఖీలు
OYO Rooms | సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో విస్తృత తనిఖీలు
హోటళ్లు, లాడ్జీల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
OYO Rooms | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : నగరంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు హోటళ్లు, లాడ్జీలు, ఓయో రూమ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసు కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షణలో అమీర్పేట్, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లోని ఓయో హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటళ్లు, లాడ్జీల్లో బస చేస్తున్న అతిథుల వివరాలు, నమోదు చేసిన రికార్డులను పోలీసులు పరిశీలించారు. అలాగే సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
హోటళ్లలో బస చేసే ప్రతి అతిథి పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సీసీటీవీ కెమెరాలను నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఇక ‘ఆపరేషన్ కవచ్’లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను కూడా పోలీసులు ముమ్మరం చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
