ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలి

  • ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ విజయరామరాజు

భీమవరం, ఆంధ్రప్రభ: ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కేంద్రాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ విజయరామరాజు కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1, 2 తరగతులు భోదించుచున్న ఉపాద్యాయులుకు జరుగుచున్న ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా కేంద్రాలలో వేసవి తీవ్రత ఎక్కువగా వున్న కారణంగా చల్లని త్రాగునీరు, రుచికరమైన భోజనం, ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా, వాష్ రూంల్లో నిరంతర నీటి సదుపాయం కల్పించాలన్నారు.

ఈ మేరకు జిల్లా విద్యా శాఖ ఆడిషినల్ డైరెక్టర్ సత్యనారాయణ కి శనివారం వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాఫ్టో పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ విజయరామరాజు, సెక్రెటరీ జనరల్ జి.ప్రకాశం, జిల్లా కో – ఛైర్మన్లు సాయి వర్మ, క్రాంతి కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ రామచంద్ర రావు,రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply