మిట్టపల్లి పౌలు నామినేషన్ దాఖలు..

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : సీపీఐ పార్టీ తరఫున మైనార్టీ కోటాలో కోఆప్షన్ సభ్యుడిగా మిట్టపల్లి పౌలు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం మిట్టపల్లి పౌలు సమర్థవంతంగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ వైస్ చైర్మన్ మిట్టపల్లి సరిత శ్రీనివాస్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కాదండి సాంబయ్య, మామిడి గోపి, ఎగుడ మొండి, కౌన్సిలర్లు కౌడగాని సాంబయ్య, మద్దెల శంకర్‌తో పాటు పార్టీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply