అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిద్దాం…

అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిద్దాం…
చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతి
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మండలం కాచారం గ్రామంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించరు … ఈ సందర్భగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు బేజాడి వినోద మాట్లాడుతూ బాలికా విద్యా కోసం,మహిళా సంక్షేమం కోసం సావిత్రి భాయి ఫూలే అసాధారణ కృషి చేశారని అన్నారు. వారు సాగించిన పోరాటాల స్పూర్తితో విద్యార్థి లోకం విజ్ఞాన మహిళా సాధికారతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మానవతా మూర్తి, సావిత్రీబాయి ఫూలే గారి స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపేందుకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాలనీ అన్నారు. వారి ఆశయాల వెలుగులో నాణ్యమైన విద్య కోసం విద్యార్డిలోకం పోరాడాలనీ వారు పిలుపునిచ్చారు. వారి కాలంలో విద్యా అందరికీ అందాలని సామాజిక, సాంస్కృతిక అధిపత్యాలు రద్దు కావాలని భావించి వారు అసమాన పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 1848 లోనే బాలికల విద్య కోసం తొలి మహిళా పాఠశాలను స్థాపించి విద్యను సామాన్యులకు, మహిళకు అందుబాటులో తెచ్చిన తీరు ప్రశంసనీయం అని అన్నారు.
దేశంలో ప్రభుత్వాలు అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశంలో సామాజిక రుగ్మతలు, వివక్షలు, అసమానతలు విజృంభిస్తున్నాయని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా యువత అక్షర పోరాటంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజకీయ సామాజిక ,ఆర్థిక, సాంస్కృతి రంగాలలో మహిళకు తగిన ప్రాతినిధ్యం, అవకాశాలే ఇవ్వాలని అన్నారు. మహిళలపై జరుగుతున్న ఆధిపత్య దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. నేటి యువతరం మహాత్మ జ్యోతి రావు ఫూలే,సావిత్రి భాయి ఫూలే దంపతుల స్ఫూర్తితో విద్యార్థులు పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమలాలో బండారు రాణి, మహంకాళి ఋతు, తేజ, చిన్నారి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
