మెగా కంపెనీకి నోటీసులు..

మెగా కంపెనీకి నోటీసులు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబుపేట శివారులో మెగా కంపెనీకి చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో ఆర్ఐ రాజేందర్ నోటీసులు అందజేశారు. మట్టి /గ్రావెల్ అనుమతుల కన్నా ఎక్కువగా రవాణా చేసి, నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం కొరకు ఉపయోగిస్తున్నారని, అభ్యంతరాలు ఉన్నందున ఈ విషయంలో జిల్లా డైరెక్టర్ గనుల శాఖ వారిని విచారణ చేసి అనుమతులకు మించి తెస్తున్నారా..? లేదా..? పరిమితిలో ఉన్నారా అనే విషయం తెలిసే వరుకు పనులు ఆపివేయలని, తహసీల్ధార్ వసంతరావు జారీ చేసిన నోటీస్ ఆర్ఐ అందజేశారు.

Leave a Reply