Standing Council | స్టాండింగ్ కౌన్సిల్ వెంకటాచలపతికి సన్మానం…

Standing Council | స్టాండింగ్ కౌన్సిల్ వెంకటాచలపతికి సన్మానం…

Standing Council | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణానికి చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది బాల్యం వెంకటాచలపతిని కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్(Standing Council) గా చౌటుప్పల్ కు చెందిన బాల్యం వెంకటాచలపతి యాదాద్రి భువనగిరి జిల్లాకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నియమించారు. ఆయ‌న నియామ‌కం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కైరంకొండ అశోక్ ఆధ్వర్యంలో పూలమాల‌లు, శాలువాలతో వెంకటాచలపతిని సన్మానించారు.

అదేవిధంగా మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బీహార్ వాజపేయి(Atal Bihari Vajpayee) 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శాగ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు ఉడుగు వెంకటేశం, యాస అశోక్ రెడ్డి, వనం ధనంజయ్య, కాసుల వెంకటేశం, కట్ట కృష్ణ, గుర్రం రవీందర్, గోషిక పూరషోత్తం, నల్ల అంజయ్య, కొండూరు దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply