జాతీయ రహదారిపై కొనసాగుతున్న ‘స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం..

జాతీయ రహదారిపై కొనసాగుతున్న ‘స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం..

రోడ్డు ప్రమాదాల నివారణ,ప్రజల భద్రతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు….

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాలు అధికమయ్యాయి.జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించుటకు ప్రతిరోజు ప్రధాన రహదారులలో స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం నిర్వహించడంతో పాటు వాహనాలు తనిఖీ చేయాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు రాత్రి సమయాల్లో కార్యక్రమాలు చేపట్టారు.ప్రైవేట్ వాహనాలు,ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే వాహనాలలో ప్రజల భద్రతను దృషిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు, సరైన భద్రతా చర్యలు, జాగ్రత్తలు పాటించాలని బస్సులలో తనిఖీలు చేపట్టారు.పోలీసులు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు జిల్లా రాత్రిపూట తిరిగే వాహనాలను ఆపి “స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

కడప, నంద్యాల హైవేలో,కర్నూలు, విజయవాడ వెళ్ళే హైవేలో నంద్యాల నుండి చిత్తూరు 44 హైవే,కర్నూలు నుండి బెంగుళూరు వైపు వెళ్ళే వాహనాలు, జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలను ఆపి“స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో”కార్యాక్రమం నిర్వహించరు.వాహనాలకు సంబంధించిన ద్రువపత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు.వాహనాలు నడిపే సమయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని డ్రైవర్లకు గుర్తు చేస్తున్నారు. వాహనాలను అతి వేగంతో నడపకుండా, రాంగ్ రూట్ లో వెళ్ళకుండా, పరిమితికి మించి ప్రయాణీకులకు ఎక్కించుకునే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు తెలిపారు.

Leave a Reply