మెగా డీఎస్సీని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగ భృతిపై నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. మార్చి వచ్చినా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు.
KNL | తక్షణమే డీఎస్సీని విడుదల చేయాలి… కర్నూల్లో ఆందోళన
