BJP MLA | ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష

ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వైద్యురాలు అర్చన గుప్తా మృతి కేసులో బిహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో అర్చన గుప్తా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

విచారణలో ఎమ్మెల్యే రాజుకుమార్ నిర్లక్ష్యపూరితంగా జరిపిన కాల్పుల కారణంగానే వైద్యురాలు మృతి చెందినట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో ఆయనకు నాలుగేళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

అంతేకాకుండా, బాధితురాలి భర్తకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పు నిర్లక్ష్యంగా ఆయుధాలు వినియోగించడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలపై మరోసారి దృష్టి సారించింది.