వైభవంగా ముగిసిన శ్రీ భూనీళా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

హాజ‌రైన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్

కేసముద్రం, ఆంధ్రప్రభ: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమినాపురం గ్రామంలో వెలసిన శ్రీ భూనీళా సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నవమ వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హేమంత ఆచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు వినయ్ మిశ్రా ఆధ్వర్యంలో మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ అనంతరం శ్రీదేవి, భూదేవి, చక్రపెరుమాళ్లతో కలిసి ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి పుష్కరిణి (కోనేటి) వద్ద చక్రపెరుమాళ్లకు చక్రస్నాన కార్యక్రమం భక్తుల మధ్య ఘనంగా జరిగింది.

సాయంత్రం శ్రీ పుష్పయాగం, ధ్వజావరోహణం, సప్తావర్ణం, దేవతోద్వాసనం, ఋత్విక్ సన్మానం, భక్తులకు ఆశీర్వచనాలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ భానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్మన్ అల్లం రమా నాగేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఓలం మురళి, ప్రధాన కార్యదర్శి బచ్చు పరమేశ్వర్, కోశాధికారి కోయగురి యాకూబ్ రెడ్డి, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.