దయాల రవీందర్ గౌడ్ ఘనతకు 20 ఏళ్ల సంబరం
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: ప్రపంచ క్యారమ్ క్రీడా వేదికపై భీమ్‌గల్‌కు చెందిన దయాల రవీందర్ గౌడ్ రన్నరప్‌గా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చారిత్రక ఘట్టానికి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శనివారం భీమ్‌గల్ క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ వేడుకలు నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ తహేర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రవీందర్ గౌడ్ విజయాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నీలం రవి మాట్లాడుతూ భీమ్‌గల్ వంటి చిన్న ప్రాంతం నుంచి తొమ్మిది మంది క్రీడాకారులు జాతీయ స్థాయి క్యారమ్ పోటీల్లో పాల్గొనడం గర్వకారణమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రన్నరప్‌గా నిలిచిన దయాల రవీందర్ గౌడ్ విజయంతో భీమ్‌గల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిందని, ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
కార్యక్రమంలో క్యారమ్ అసోసియేషన్ సభ్యులు సతీష్, రాజేందర్, వెంకటనర్సయ్య, శివానంద్ రెడ్డి, శ్యామ్, రహీం హునాని, సురేందర్, మోహన్, ఇక్రామ్, ఇబ్రహీం, లక్ష్మణ్‌తో పాటు పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొని దయాల రవీందర్ గౌడ్‌ను అభినందించారు.
