State Medical | ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం

State Medical | ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం

State Medical | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) అన్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాలను మంగళవారం వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో 11 కోట్ల రూపాయలతో 11 ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు కార్యాలయాల భవనాలు నిర్మించి ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్యాంద్ర ప్రదేశ్ ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. సర్వజన ఆసుపత్రి ఆవరణలో 92.22 లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం, సహాయ సంచాలకులు కార్యాలయాలను స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గతంలో అద్దె భవనాల్లో ఔషధ నియంత్రణ కార్యాలయంలో ఉండేవి. ఇప్పుడు కొత్త భవనాలు నిర్మించి ప్రారంభించడం ఆనందంగా ఉంది అన్నారు. ఔషధ నియంత్రణ జిల్లా అధికారి చంద్రరావు (Chandra Rao) మాట్లాడుతూ… నూతన భవనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 భవనాలు వినియోగంలోకి వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఆర్ వంశధార ఛైర్మన్ అరవల రవీంద్ర బాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అప్పలనాయుడు, జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్, ఎపిఎంఐసిడిఎస్ ఇఇ శిమ్మన్న, ఔషధ నియంత్రణ అధికారి ఎన్. యుగంధర్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply