తల్లి ముర్రుపాలే బిడ్డకు మొదటి టీకా
రాప్తాడు, ఆంధ్రప్రభ: తల్లి మర్రుపాలె బిడ్డకు మొదటి టీకా అని అంతకుమించిన మందు ఇంకొకటి లేదని ఐసీడీఎస్ సూపర్వైజర్ లీలావతి పేర్కొన్నారు. గురువారం రాప్తాడు మండలంలోని పాలచెర్ల భోగినేపల్లి రామినేపల్లి మరియు గొందిరెడ్డిపల్లి అంగన్వాడీ సెంటర్లలో ప్రపంచ తల్లిపాల వారోత్సవంను నిర్వహించారు.ముందుగా అంగన్వాడీ టీచర్లు బాలింతలు గ్రామ మహిళలతో కలిసి ర్యాలీ చేపట్టారు.
అనంతరం సూపర్వైజర్ లీలావతి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన వెంటనే గంట లోపల తల్లి ముర్రుపాలు పట్టాలని ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా అని, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం అని అన్నారు. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి.ఏ ఇతర పాలు పట్టకూడదని తెలియజేశారు.తల్లి పాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదన్నారు. గర్భవతులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సెక్టార్-2 సూపర్వైజర్ శ్రీవాణి, అంగన్వాడీ టీచర్లు మంజుల, శ్రీదేవి, రామేశ్వరి, లక్ష్మీదేవి ఈశ్వరమ్మ, ఓబులమ్మ, వరలక్ష్మి, ఆశా వర్కర్లు రామాంజనమ్మ, లక్ష్మీదేవి, ఆయాలు నాగలక్ష్మి, లక్ష్మీదేవి, మహిళలు పాల్గొన్నారు.
