హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా..

హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా..
- స్టాళ్లను సందర్శించిన మంత్రులు
హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించబడుతోంది. గురువారం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరై వివిధ స్టాళ్లను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, రాష్ట్ర హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్పాయి, డాక్టర్ సత్య శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో అతిథులు పంటల వైవిధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతు సంక్షేమ పథకాలు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
