కొలతలపై క్లారిటీ లేని రోడ్డు విస్తీర్ణ పనులు..

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో అధికారులు చేపడుతున్న రోడ్డు విస్తీర్ణ పనులలో ఇప్పట్టి వరకు కొలతల లో అధికారులు ఎలాంటి క్లారిటీ ప్రకటించక పోవడంతో వ్యాపారాలు, ఇంటి యజమానాలు ఆందోళన చెందితున్నారు. గత నాల్గు రోజుల నుంచి మున్సిపాల్టీ పరిధిలోని పాతబస్ స్టాండ్ నుంచి గాంధీ చౌక్ మీదుగా పెద్దచెరువు వరకు చే పట్టే రోడ్డు పనులు అధికారులు చేపడుతున్నారు.

రోడ్డు వెడల్పు లో వ్యాపారాలు స్వచ్చందంగా తమతమ భవనాలను కూల్చివేసుకుంటున్నారు. అధికారులు గత నాల్గు నేలనుంచి పనులు చేపడుతున్నమని చెబుతూ వస్తున్నారే తప్ప అసలు రోడ్డు విస్తీర్ణం ఏ మేరకు చెప్పాడుతున్నారో క్లారిటీ ఇవ్వలేక తెలియచేయక వ్యాపారులను సందిగ్ధంలో పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికె వ్యాపారాలు భవనాలను ఖాళీ చేసి కూల్చివేసుకుంటున్నారు.

Leave a Reply