8వ వార్డు కౌన్సిలర్ చొరవ…!

8వ వార్డు కౌన్సిలర్ చొరవ…!

  • రాజేష్ స్పందనతో సమస్యకు చకచకా పరిష్కారం
  • ఆలస్యం లేకుండా చర్యలు..
  • కోతుల భయం నుంచి బాటసారులకు విముక్తి…
  • మార్కండేయ గుడి వద్ద మట్టి కుప్పలు తొలగింపు
  • బస్టాండ్‌లో విద్యుత్ దీపాల ఏర్పాటు
  • మాటలు కాదు…పనులతోనే నమ్మకం గెలిచిన నాయకుడు
  • ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజేష్ ముందడుగు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపితే ఎంత వేగంగా ఉపశమ నం లభిస్తుందో మరోసారి నిరూపించారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపా లిటీ పరిధిలోని చాగల్లు గ్రామం 8వ వార్డులో బాటసారులు ఎదుర్కొం టున్న సమస్యకు కౌన్సిలర్ పొన్న రాజేష్ చొరవతో ఎట్టకేలకు పరిష్కా రం చూపారు.

మంచినీళ్ల బావి నుంచి కమ్మరి పేటకు వెళ్లే మార్గంలో కట్టకు ఆనుకుని చెట్లు విపరీతంగా పెరిగి రహదారి పూర్తిగా మూసుకు పోయే పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా చెట్లపై సంచరించే కోతుల కార ణంగా ప్రజలు భయాందోళనకు గురవుతూన్నారు. రోజు వారీ రాక పోక లకు తీవ్ర ఆటంకం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక కాలనీ వాసులు తమ సమస్యను వెంటనే వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్ దృష్టికి తీసుకెళ్లారు.

  • స్వయంగా కౌన్సిలర్ రాజేష్ పనులను పర్యవేక్షిస్తూ…

కాలనీ వాసుల సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి పూర్తిగా అర్థం చేసు కున్న కౌన్సిలర్ పొన్న రాజేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధి త విషయాన్ని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ శనివారం జేసీబీని పంపించారు. అనంతరం కౌన్సిలర్ రాజేష్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ రహదారి ఇరువై పులా పెరిగిన చెట్లు, ముళ్ల పొదలను తొలగింపజేసి మార్గాన్ని పూర్తిగా శుభ్రం చేయించారు.

ఈ చర్యలతో ఆ మార్గంలో ప్రయాణించే వాహన దారులు, పాద చారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయి ప్రజలకు పెద్ద ఎత్తున ఊరట లభించింది. అదేవిధంగా ఉగాది పండుగ ను దృష్టిలో పెట్టుకుని మార్కెండేయ గుడి సమీపంలో ఉన్న మట్టి కుప్ప లను కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు చైర్మన్ సహకారంతో తొలగించారు. అదనంగా బస్టాండ్ ఆవరణలో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు పనిచే యక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన కౌన్సిలర్ వెంటనే స్పందించి అక్కడ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించారు.

ముందస్తు చర్యలతో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన కౌన్సిలర్ రాజేష్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మాటల కే పరిమితం కాకుండా పనులతోనే ప్రజల మనసులు గెలుచుకుంటున్న నాయకుడిగా ఆయన మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు.

  • వార్డు ప్రజల సమస్యలే నా సమస్యలు : (8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్)

వార్డు ప్రజల సమస్యలే నా సమస్యలు..రాబోయే కాటమయ్య పండు గను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ పనులు చేపట్టాం. కౌన్సిలర్‌గా ఎన్నికైన నాటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రజల సేవే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply