జంట హత్యల కేసు నిందితుడికి ఉరిశిక్ష

జంట హత్యల కేసు నిందితుడికి ఉరిశిక్ష

  • కోర్టు సంచలన తీర్పు

చెన్నారావుపేట, ఆంధ్రప్రభ:
సంచలనం సృష్టించిన 2024 జూలై 11వ తేదీ నాటి పదహారు చింతల తండా జంట హత్యల కేసు నిందితుడు నాగరాజుకు ఉరిశిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి బుధవారం సంచలన తీర్పునిచ్చారు.

వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని 16 చింతల తండాకు చెందిన బానోతు శ్రీను-సుగుణ దంపతుల కుమార్తెను గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. సదరు నాగరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అప్పటి నుండి యువతి తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్న నాగరాజు 2024 జూలై 11వ తేదీ అర్ధరాత్రి నిద్రిస్తున్న యువతి తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. అడ్డు వచ్చిన యువతి, యువతి సోదరుడికి సైతం గాయాలయ్యాయి.

మరుసటి రోజు గుండెంగ గ్రామంలోని పాఠశాలలో తలదాచుకున్న నిందితుడిని పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. సరైన సాక్ష్యాధారాలు పోలీసులు కోర్టుకు సమర్పించడంతో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి మైత్రేయి బుధవారం తీర్పు వెలువరించారు.

Leave a Reply