నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు శివారపు శ్రీధర్, మమత దంపతుల కుమార్తె నందిని, అలాగే ఆ పార్టీ మండల నాయకులు బెజ్జంకి బ్రహ్మచారి, రాజేశ్వరి దంపతుల కుమారుడు భరత్‌ల వివాహం గురువారం స్థానిక హరిహర గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది.

ఈ వివాహానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, మార్కెట్ చైర్మన్ గంట సంజీవ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు, డీసీసీ అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి, నాయకులు బండారు వెంకన్న, కదిరే సురేందర్, కౌన్సిలర్లు తరాల వీరేష్ యాదవ్, రాజు, మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య, తరాల సుధాకర్, ఉప్పల వంశీ, సీఈఓ మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు.