భోగాపురం మోడల్ స్కూల్‌ను సందర్శించిన మంత్రులు
విజయనగరం, ఆంధ్రప్రభ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న ఆధునిక బోధనా విధానాలు, మౌలిక వసతులను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు.
