గిరిజన తండాలలో సీత్లా భవాని పండుగ ఉత్సవాలు

తొర్రూరు, ఆంధ్రప్రభ: తొర్రూరు మండలంలోని భోజ్య తండా, జీకే తండా, అమర్ సింగ్ తండా, దుబ్బా తండా, గుడిబండ తండా, టీక్యా తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన తండాలతో పాటు, పలు తండాలలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సీత్లా భవాని పండుగను మంగళవారం తండావాసులు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు,గిరిజన యువతులు, మహిళలు నూతన సంప్రదాయ వస్త్రధారణలో డప్పు చప్పుళ్లు, నృత్యాల మధ్య సీత్లా భవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. తండాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. సీత్లా భవాని కృపతో గ్రామాల్లో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రార్థించారు.ఈ వేడుకల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు,ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు,యువతి, యువకులు, మహిళలు, భక్తులు తదితరు పాల్గొన్నారు.