7వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి

బిఆర్ఎస్ నాయకులు చిట్యాల జుబేర్ పాషా
మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థి చిట్యాల నవీద్ పాషాను అండగా నిలిచి ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తామని బి ఆర్ ఎస్ నాయకులు చిట్యాల జుబేర్ పాష విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన బిఆర్ఎస్ నాయకులతో కలిసి 7వ వార్డు పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోని 7వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని అన్నారు .అయ్యప్ప కాలనీలో రోడ్లు డ్రైనేజీ లేక అస్తవ్యస్తంగా మారిందన్నారు .ఆ వీధి ప్రజల కష్టాలు తొలగించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు .రోడ్లు డ్రైనేజీ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. 7వ వార్డు అభివృద్ధికి పూర్తి
