ఇందిరమ్మ రాజ్యంలోనే ఇంటింటా సౌభాగ్యం..

ఇందిరమ్మ రాజ్యంలోనే ఇంటింటా సౌభాగ్యం..

  • రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఇందిరమ్మరాజ్యంతోనే ఇంటింటా సౌభాగ్యంసాధ్యమని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటిశ్రీహరిఅన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్దుంపూర్ లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికిహాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లుమంజూరుచేస్తామని అన్నారు. పేదల సొంతింటి కల ప్రభుత్వం నెరవేరుస్తుందని అర్హులైన పేదలకు మరిన్ని ఇండ్లు మంజూరుచేస్తామనిఅన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేస్తుండడంతో లబ్ధిదారుల కళ్ళల్లో సంతోషంచూస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తే మరిన్నిఇల్లుమంజూరుచేస్తామని అన్నారు. మొగ్దుంపూర్ సర్పంచ్ తిరుమలేష్ తమ గ్రామానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా జాబితా పరిశీలించి ఇండ్లు మంజూరు చేస్తాననిహామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిషోర్ కుమార్, సర్పంచ్ తిరుమలేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కోటి జనార్దన్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply