జుక్కల్ లో ఘనంగా సీతారాముల కళ్యాణం…

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీరామాలయం (శ్రీ గోవింద్ మహారాజ్ మఠ్ సంస్థాన్)లో సీతారాములోరి కళ్యాణం కన్నుల పండుగగా వైభవపేతంగా, కొనసాగింది.

మఠాధిపతి శ్రీ గోపాల్ గోవింద్ మహారాజ్, శ్రీ కేశవ్ మహారాజ్, శ్రీ గోవింద్ మహారాజ్, వేదబ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య అశేషభక్తులు, ప్రజల మధ్యన రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది.

మఠం ద్వారా భక్తులందరికీ సకల సౌకర్యాలతో పాటుప్రసాద కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు.మహిళా భక్తులు మహిళలు అత్యధికంగా పాల్గొని ఇట్టి కల్యాణఉత్సవన్నీ కనులరా తిలకించారు.శ్రీ రామాలయం శ్రీసీతారామ నామస్మరణతో మారుమోగింది.

Leave a Reply