కన్నీటి వీడ్కోలు..

కన్నీటి వీడ్కోలు..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లాటేకుమట్ల గ్రామానికి చెందిన మేకల తిరుపతి అకాల మరణం చెందగా విషయాన్ని తెలుసుకున్న బి ఆర్ ఎస్ మండల నాయకులు, బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి ఆది సునీత రఘు, టౌన్ అధ్యక్షులు నిమ్మల స్వామి హాజరై తిరుపతి మృతదేహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు.

తదనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పించి అంతిమయాత్రలో పాల్గొని ప్యాడ మోసినారు బి ఆర్ ఎస్ పార్టీకి మేకల తిరుపతి చేసిన సేవలను గుర్తు చేసుకొని వారు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ కమిటీ సభ్యులు టేకుమట్ల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్ 1 అంత్యక్రియలో పాల్గొన్న నాయకులు.

Leave a Reply