ప్రభుత్వం ఏకకాలంలో రైతు భరోసా ఇవ్వాలి

ప్రభుత్వం ఏకకాలంలో రైతు భరోసా ఇవ్వాలి
- మాజీ ఎంపీపీ జైవంతరావు
ఉట్నూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే రైతు భరోసా సహాయం నిధుల వాయిదా రూపంలో కాకుండా ఏకకాలంలోనే చెల్లించాలని ఉట్నూర్ మాజీ ఎంపీపీ బి ఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మండల అధ్యక్షులు పంద్ర జైవంతరావు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆయన నాయకులతో కలిసి బుధవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడి గూడలో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సభలో రైతులకు ఐదు ఎకరాలలో ఇస్తామని చెప్పి ఆంధ్ర రైతులకు రైతు భరోసా సహాయం చెల్లించడంలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ముందు ఎకరానికి రూ. 15000 ఇస్తానని చెప్పి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగా రైతు భరోసా సహాయం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గా రైతులకు రైతు భరోసా సహాయ నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా నిధులు కేవలం ఒక్కొక్క ఎకౌంట్లో రూ.6000 జమ అయ్యాయని, మిగతా ఐదు ఎకరాల రైతులకు రైతులకు రైతు భరోసా డబ్బులు రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఎప్పుడు పడతాయోనని అని ఎదురుచూస్తున్నారని అన్నారు.
వాయిదాల రూపంలో రైతు భరోసా డబ్బులు చెల్లించకుండా ఒకేసారి రైతులందరికీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులకు సంబంధించిన రైతు భరోసా కూడా ఇవ్వకుండా రైతులకు ఇబ్బందులు చేస్తున్న విషయం రైతులు గుర్తిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో రైతులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు సిడాం సోనేరావు పటేల్ , పంద్ర మాణిక్ రావు, ఆత్రం బాగ్వంత్ రావు, సిడాం రాంషా, పంద్ర అనంద్ రావు, పెందుర్ త్రిమూర్తి, పంద్ర జలింషా, మరప జాకు, సుదర్శన్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
