సిద్ధులగుట్టలో మహాగిరి ప్రదక్షిణ
సిద్ధులగుట్టలో మహాగిరి ప్రదక్షిణ
మహాగిరి ప్రదక్షణలో పాల్గొన్న వందలాది మంది భక్తులు …
బచ్చన్నపేట,ఆంధ్రప్రభ : ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కొడవటూర్ స్వయంభు సిద్దేశ్వర స్వామి సిద్దులగుట్ట లో తొలిసారి మహా గిరి ప్రదక్షణ మహోన్నత కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. 147 ఎకరా. ల్లో విస్తరించి ఉన్న పరమశివుడి స్వరూపమైన సిద్దులగుట్ట చుట్టూ 4 కిలో మీటర్లు కాలినడకన చేసే పవిత్రయాత్రకు ఆలయ అధికారులు, పూ జారులు పరమశివుడికి ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురష్కరించుకుని మహాగిరి ప్రదక్షణ ప్రారంభించారు.
మాగిరి ప్రదక్షణకు వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. స్వయంభూ సిద్ధేశ్వరస్వామి వెలిసిన ఈ పవిత్ర గుట్ట పరిసరాల్లో సిద్ధులు, యోగులు శతాబ్దాల పాటు సంచరిస్తూ, తపస్సులు చేసేవారని చెబుతారు. ఈగుట్టపై అనేక ఔషధ మొక్కలున్నాయని, ఆయుర్వేదంపై అవగాహన కలిగి ఉన్నవారు ఇప్పటికీ వినియోగిస్తారని స్థానికులు చెబుతున్నారు.మహా గిరి ప్రదక్షిణ చేయటంతో పాపాలు తొలగి, అంతర్గత శాంతి ఏర్పడి శివానుగ్రహాన్ని పొందవచ్చని ప్రధాన ఆర్చకుడు ఓం. నమః శివాయ, ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ తెలిపారు.
ప్రతి మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు తెల్లవారు జామున గిరి ప్రదక్షిణ ఉంటుందన్నారు. ఉదయం 9-15 గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణకు వచ్చిన వందలాదిమంది భక్తులకు తాగునీటి సౌకర్యం గిరి ప్రదక్షణ ముగిసిన అనంతరం పులిహోర పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో ఆలయ జూనియర్ అధికారులు శ్రీనివాస్, లక్ష్మీకాంత్ రెడ్డి, అర్చకులు సదాశివుడు మహాశివుడు, ఆలయ సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు.
