కేసీఆర్ సభకు నియోజకవర్గ ఇంచార్జిగా పెద్ది సుదర్శన్ రెడ్డి

కేసీఆర్ సభకు నియోజకవర్గ ఇంచార్జిగా పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, ఆంధ్రప్రభ: జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ సభకు చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జిగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని నియమించినట్లు కేటీఆర్ ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి మాజీ సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌చార్జీలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ ఈ సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుసంబంధించి ప్రత్యేక ఇన్‌చార్జీలను కేటీఆర్ ఖరారు చేశారు.
చొప్పదండి ఇంచార్జిగా.. పెద్ది సుదర్శన్ రెడ్డి సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు,మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply