కళ్యాణానికి ముస్తాబైన ఆలయం..

కళ్యాణానికి ముస్తాబైన ఆలయం..

జన్నారం, ఆంధ్రప్రభ : శ్రీరామనవమిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీలోని శ్రీ పట్టాభి సీతారామ చంద్రస్వామి ఆలయంలో కళ్యాణోత్సవానికి ఆలయం ముస్తాబయింది. రేపు కళ్యాణం చేయనున్నారు. శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ మిక్కిలినేని రాజశేఖర్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ఆవరణలో శుక్రవారం నిర్ణీత గడువుకు సీతారాముల కళ్యాణం వేద పండితుల మధ్య నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు వేసి, తాగునీటి సౌకర్యం కల్పించారు. దర్శనానికి వచ్చే భక్తులందరి కోసం ప్రసాదం అందించి, అన్నదానం చేయనున్నారు. ఈ మేరకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ మిక్కిలినేని రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు ఎం.ఆర్ నర్సింగరావు, కోశాధికారి గుండ సుధాకర్ మాట్లాడుతూ, కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అవసరం కలుగకుండా అన్ని ఏర్పాటు పూర్తి చేశామన్నారు.

భక్తులంతా స్వామి వారి కళ్యాణాన్ని దగ్గరుండి వీక్షించి, క్యూ పద్ధతి పాటించి మొక్కులు తీర్చుకొని సహకరించాలని వారు కోరారు. మండలంలోని తిమ్మాపూర్, రేండ్లగూడ గ్రామాల్లోని రామాలయం ఆలయాల్లో సీత రామచంద్రుల వివాహం ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు.