Siddaramaiah | గవర్నర్ కార్యదర్శికి లేఖ అందజేత..
Siddaramaiah | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న ఈ నిర్ణయం గురువారం అధికారిక రూపం దాల్చింది.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో కలిసి సిద్ధరామయ్య లోక్‌భవన్‌కు వెళ్లారు. అయితే ఆ సమయంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
సీఎం రాజీనామా లేఖను స్వీకరించినట్లు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ధ్రువీకరించారు. గవర్నర్ తిరిగి వచ్చిన అనంతరం రాజీనామాపై అధికారిక నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈ పరిణామంతో కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై రాజకీయ చర్చలు వేగం పుంజుకున్నాయి.
