Incident | తండ్రి చేతిలో కుమారుడు…

Incident | తండ్రి చేతిలో కుమారుడు…

Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రు తండాలో గంజాయి వ్యసనంతో బాధపడుతున్న కుమారుడిని తండ్రే గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, చంద్రు తండాకు చెందిన అఖిల్ అనే యువకుడు కొంతకాలంగా గంజాయికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం కూడా అతను తన తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

కొడుకు హింసను భరించలేక ఆగ్రహానికి గురైన తండ్రి జీవన్, ఇంట్లో ఉన్న గొడ్డలితో అఖిల్‌పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply