నంద్యాలలో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తాం…

నంద్యాలలో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తాం…

స్విమ్మింగ్ విజేతల అభినందన సభలో ఎంపీ బైరెడ్డి శబరి…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఒక అత్యాధునిక స్విమ్మింగ్ పూల్ మంజూరు చేయిస్తామని తద్వారా జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్విమ్మర్లను తయారు చేస్తామని పార్లమెంట్ సభ్యురాలు, డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.జగ్గయ్యపేటలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన కాశీపురం ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిల అభినందన సభకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రామకృష్ణా పి జి కళాశాలలో డా. జి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు ఎంపీ శబరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి స్విమ్మర్ నే అన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించానన్నారు. స్విమ్మింగ్ చేయడం వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీ పిల్లలకు ఈత నేర్పించడం మీరిచ్చే గొప్ప బహుమతిఅని పేర్కొన్నారు. స్విమ్మింగ్ లో రాణిస్తే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సాధించవచ్చుఅన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో ఒక ప్రొఫెషనల్ స్విమ్మింగ్ పూల్ మంజూరు చేయిస్తాంఅని హామీ ఇచ్చారు. నంద్యాల నుంచి స్విమ్మింగ్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేద్దాంఅన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు క్రీడలకు అపారమైన ప్రోత్సాహం ఇస్తున్నారన్నారు. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి.రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ స్విమ్మింగ్ మీద మక్కువతో తన ఇంట్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశామన్నారు.

రోజూ స్విమ్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం మీ గుప్పిట్లో ఉన్నట్లే అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్ల ల ప్రముఖ వైద్యుడు డాక్టర్ జూపల్లి రాకేష్ రెడ్డి,మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నరహరి విశ్వనాథ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply