స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర పై ర్యాలీ

స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర పై ర్యాలీ

రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాప్తాడు మండల కేంద్రంలోని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో స్వచ్ఛఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ జల వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ప్రజలు పాల్గొని నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, పచ్చదనం పెరుగుదల వంటి అంశాలతో పాటు కళాశాలలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు, అచ్యుతనంద బాబు, ఏవో కృష్ణ చైతన్య, ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply