ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్

ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది.
సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను 39వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, 44వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకులు దాడి మురళి, సెక్టార్-3 ఎస్‌ఐ పీ శివ, సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సంబంధిత అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని కూటమి నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చల్లం రాజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముదిగొండ శివ, టీడీపీ నేత గూడెల ఉమామహేశ్వరరావు, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
