LORD | వేంకటేశ్వరుని దర్శనం మహాభాగ్యం

ఎమ్మెల్యే అంజిబాబు
LORD | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: వేంకటేశ్వర స్వామివారిని పూజించుకున్నా, దర్శించుకున్నా అందరికీ మంచి జరుగుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం జేపీ రోడ్డులోని పద్మావతీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మూడురోజులుగా జరుగుతున్న స్వామివారి పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. వేద పండితులు శ్రీమాన్ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదచార్యులు, ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు, ఏపిఐఐసి డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, ఆలయ పాలకవర్గ సభ్యులు వేలూరి సుబ్రహ్మణ్యశర్మ, వీరమల్లు శ్యామలావతి, కొలిపాకుల దుర్గాప్రసాద్, మల్లివలస వెంకట లక్ష్మి, ఇంటి నాగలక్ష్మి, మేడూరి సత్యనారాయణ, ఉప్పలపాటి సత్యనారాయణరాజు, గంధారపు వెంకట రమణ, ముదుండి కాశీ విశ్వనాథరాజు, బండి రాణి, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
